Friday, 11 December 2015

సుప్రభాతమా ! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601


సుప్రభాతమా ! - గవిడి శ్రీనివాస్ 08722784768 ,9966550601

సుప్రభాతమా  సుమధుర దేశమా
సస్య శ్యామల  శోభిత  దృశ్యమా 
చ1) మట్టి తల్లి గుండెల్లో  వికసించే బిడ్డలూ
మమకారపు పేగుపైన  అల్లుకునే బంధాలూ
పుడమి తల్లి గడ్డ పైన ఏ మనసుకదిపినా 
రాలుతున్న శ్రమలో రగులుతున్న వ్యధలెన్నో 
ఊగుతున్న జీవికలో ఉదయించని బతుకులెన్నో 
కాగుతున్న గుండెల్లో జారుతున్న కన్నీటివాగులెన్నో
కానరాని చీకటిలో వొరుగుతున్న నిట్టూర్పులెన్నో    ||సుప్రభాతమా||
చ2) కలిమి లేమి లన్ని  నిన్ను చుట్టి ముట్టినా 
చెరిగిపోని సంకల్పం చెలిమి చేస్తున్నది 
చెదిరిపోని స్వప్నం  ముందుకు నడిపిస్తున్నది 
ప్రతి నవ భారత  యువకునిలోనా
పులకించే పనితనం పయనించే ప్రగతి రధం 
పరవళ్ళు తొక్కే తుంగభద్రా , గంగా  , కావేరి  నదుల సాక్షిగా 
పునీతమైన గోదావరి ,నాగావళి, చంపావతి నదుల ప్రేరణ గా 
బతుకులోన  కొత్త ఆశలు చిగురిస్తున్నవి 
పుణ్యభూమి లోన శ్రమా పరిశ్రమలు వికశిస్తున్నవి  ||సుప్రభాతమా||
చ3) మాతృ గడ్డ మీద పుట్టి ఏ దేశమేగినా 
కన్నతల్లి  ఋణం తీర్చి వెన్నెల వెలుగులు పూయించాలి    
కార్మికుడా కర్షకుడా కార్య సాధకుడా 
కదం తొక్కి అడుగేస్తే 
ఇక కదిలి పోదా అవని అంతా  ||సుప్రభాతమా||

Thursday, 3 December 2015

గవిడి శ్రీనివాస్  +91(0)8722784768 , 9966550601